రెవెన్యూ శాఖలో వెయ్యి ఉద్యోగాలు..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రెవెన్యూ శాఖలో వెయ్యి ఉద్యోగాలు..!
– భర్తి చేయనున్న ప్రభుత్వం
– దరఖాస్తు, అర్హతలు ఏంటంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతోంది. రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 982 మంది సర్వేయర్ల పోస్ట్లు వుండగా 242 మంది మాత్రమే వున్నారు. రాష్ట్రంలో రెండు మూడు నెలల్లో 1000 మంది సర్వేయర్లు ను నియమించనున్నారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్ లను కేటాయించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఐటిఐ సివిల్ డ్రాఫ్ట్మెన్ సర్టిఫికెట్ సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి. 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు కలదు. అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఓ ఎం ఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

ఇదికూడా చదవండి…

శరణు.. శరణు.. శరణం అయ్యప్పా..!