హిందూ ఉత్స‌వ స‌మితికి రూ. 1 ల‌క్ష విరాళం

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందూ ఉత్స‌వ స‌మితికి రూ. 1 ల‌క్ష విరాళం
– అంద‌జేసిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు హిందూ ఉత్స‌వ స‌మితికి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి భారీ విఠాళం అంద‌జేశారు. శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని ఆయ‌న నివాసంలో హిందూ ఉత్స‌వ స‌మితి సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి స‌మితి అధ్య‌క్షురాలు, చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్లోళ్ల న‌ర్సింలుల‌కు రూ. 1ల‌క్ష న‌గ‌దును విరాళం అంద‌జేశారు. తాండూరులో హిందు ఉత్స‌వ స‌మితి స‌భ్యులు వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి హిందూ ఉత్సవ స‌మితికి రూ. 1ల‌క్ష విరాళం అందించ‌డం ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తం రావు, స‌మితి స‌భ్యులు బోయ‌రాజు, పూజారి పాండు, బాల్ రెడ్డి, వెంక‌న్న గౌడ్, రాము, అశోక్ ముదిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.