చిలకడ దుంప వేసే చూ..మంత్రం..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

చిలకడ దుంప వేసే చూ..మంత్రం..!
– గుండె ఆరోగ్యానికి ఉండదు ఢోకా
– ఎసీడీటీ, అల్సర్‌లపై పోరాటం
– ఎముకలు, దంతాలకు లాభాలు
దర్శిని డెస్క్ : నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే చిలకడ దుంపను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. ఇందులో పోషకాలు మరే దుంపల్లో ఉండవంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ ఏ, సీ, మాంగనీస్, విటమిన్ బీ6, పొటాషియం, కాపర్, నియాసిన్ వంటి పోషకాలెన్నో ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. ఇవి హార్ట్ బీట్‌ను కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యా్న్ని మెరుగుపరుస్తాయి.

వీటిని తినడం ద్వారా బిపీని అదుపులో ఉంచుకోవచ్చు. చిలకడ దుంపలోని కార్బోడ్రేట్స్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల జీర్ణశాయం ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ, అల్సర్లు తగ్గుతాయి. ఈ దుంపలు తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా కాపాడతాయి. చిలకడ దుంప మానసిక ఆందోళనలు తగ్గించేందుకు తోడ్పడుతుంది.

చిలకడ దుంపల ద్వారా మూత్రపిండాల సమస్యలు, ఎముకల సమస్యలు, కండరాల నొప్పులు లాంటివి తగ్గుతాయి. స్వీట్ పొటాటోలోని యాంటీఆక్సిడెంట్లు.. కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తరచూ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అంతేకాదు..క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. స్వీట్ పొటాటో తొక్కతో సహా తినాలి. తియ్యగా ఉండే ఈ దుంపలను ఉడికించుకుని, కాల్చుకుని లేదా వేయించి కూరగా చేసుకుని కూడా తినొచ్చు. పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం శరీరానికి సులభంగా విశ్రాంతినిస్తాయి. నరాలను శాంతపరుస్తుంది. రాత్రి భోజనం తర్వాత ఉడకబెట్టిన దుపలను తినడం మంచిదని డాక్టర్లు అంటున్నారు.

ఇదికూడా చదవండి…

హంగామా వద్దు.. హడావుడి ఉండొద్దు..!