రైల్వే దొంగకు చెడ్డరోజు
– ఫోన్ కొట్టేయబోతూ కిటికికి వేలాడిన వైనం
– పట్టుబడి పది కిలో మీటర్లు ప్రయాణం
– సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
దర్శిని డెస్క్ : దొంగలకు అన్ని దొంగతనాలు కలిసిరావు. అదృష్టంతో చోరీల నుంచి తప్పించుకున్నా.. ఏదో ఒకరోజు చెడ్డ రోజు తగిన శాస్తి అనుభవిస్తాడు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న దొంగ గురించి మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో రాత్రిపూట మహిళలు, రైలు కిటికీల వద్ద ఉన్న ప్రయాణికుల నుంచి రైలు కదిలే సమయంలో సెల్ ఫోన్లు, వస్తువులు, ఆభరణాలు ఎత్తుకెళ్లడం చూస్తూనే ఉంటాం. ప్లాట్‌ఫారమ్‌పై రైలు ఆగినంత సేపు నిష్ణాతుడైన దొంగ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు. రైలు కదలడం ప్రారంభించగానే ఎంతో చాకచక్యంగా ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లు లేదా మహిళల గొలుసు దోచుకుని లంకిస్తాడు. ఈ సమయంలో ప్రయాణికులు కేకలు వేయడం తప్ప ఏమీ చేయలేరు. అయితే ఇలాంటి దొంగతనానికి పాల్పడేందుకు యత్నించిన దొంగకు పరాభవం ఎదురవడంతో పాటు చెడ్డ రోజుగా గడిచింది. బీహార్‌లోని ఓ రైల్వే స్టేషన్లో రైలు ప్లాట్‌ఫారమ్ నుండి బయలుదేరడం ప్రారంభించిన వెంటనే దొంగ కిటికీలో చేయి వేసి కారును ఎగరవేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ప్రయాణికుడు ఆ దొంగ ఒక చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అంతలోనే రైలు వేగంగా ముందుకు సాగింది. దీంతో భయాందోళనకు గురైర దొంగ రైలు బయట కేకలు వేయడం ప్రారంభించాడు. ప్రయాణికులు.. రెండు చేతులతో పట్టుకుని ప్రాణాలను కాపాడారు. దాదాపు 10 కిలో మీటర్ల వరకు ఈ దొంగ ప్రయాణం చేశాడు. మార్గంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ధీరన్ పటేల్ ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సెప్టెంబర్ 14 రాత్రి వీడియో అని.. ఈరోజు పోస్ట్ చేశారు.
Bad day for this thief.
He was trying to snatch mobile but caught in the hands of The Family man 🤣😂 in Samastipur-Katihar Passenger Train
Later he was handed over to Police#Begusarai #Bihar #ViralVideo pic.twitter.com/myS1CY7tXK— Dhiren Patel (@DhirenP66827872) September 15, 2022
— ధీరేన్ పటేల్ (@DhirenP66827872) సెప్టెంబర్ 15, 2022


