ఉసిరి జ్యూస్.. వెరీ బెస్ట్..!
– చలికాలం రోగాలన్నింటికి చెక్
– రోజంతటి ఎనర్జీకి తగ్గేదేలే..
– మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి
దర్శిని డెస్క్ : చలికాలం గజగజ వణికించడమే కాదు. వణికిపోయే వ్యాధులను కూడా అంటగడుతుంది. శీతాకాలంలో వచ్చే రోగాలనుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పడతారు. ఆయుర్వేధ చిట్కాలను కూడా పాటిస్తారు. అయితే ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేక ప్రధాన్యం ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఉసిరి కాయలను తిన్నా, వాటిని రసం చేసుకుని తాగినా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నిపుణులు చెబుతున్నారు.
ఉసిరికాయలో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుంచి మనలను రక్షిస్తాయి. ఉసిరి రసంలో విటమిన్-సి పుష్కలంగా ఉంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి ఉసిరి మనలను రక్షిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇది రోజంతా మనల్ని ఫిట్‌గా, ఎనర్జీటిగ్‌గా ఉంచుతుంది. ఉసిరిలోని విటమిన్-C రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు, వివిధ రకాల ఆరోగ్య సమస్యల నివారణలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఉసిరిలో కెరోటిన్ ఉంటుంది. ఇది దృష్టి మెరుగుదలకు సహాయపడుతుంది. రోజూ ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటిశుక్లం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మంచి శరీర ఆకృతిని పొందవచ్చు. ఉసిరి రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇది కొవ్వును కరిగించడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరిలోని అధిక విటమిన్ సి కంటెంట్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. UV కిరణాల నుండి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది, ఫలితంగా ఆరోగ్యకరమైన, మరింత ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఉసిరి రసం జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
ఇదికూడా చదవండి…

