కందనెల్లిలో వైభవంగా భగవద్గీత పారాయణం

తాండూరు రాజకీయం వికారాబాద్

కందనెల్లిలో వైభవంగా భగవద్గీత పారాయణం
– 18 అధ్యాయాలు పఠనం చేసిన తాండూరు గీతా సత్సంగ్ సేవా సమితి
– భక్తి పారవశ్యంలో మునిగిన భక్తులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం కందనెల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో భగవద్గీత సంపూర్ణ పారాయణం వైభవంగా జరిగింది. తాండూరు గీత సేవా సత్సంగ్ సమితి అధ్యక్షులు నారాయణ, మరియు ప్రతినిధులు ఆలయంలో ఉదయం 9 గంటలకు నుంచి ఒంటి గంట వరకు 18 అధ్యాయాల భవద్గీత శ్లోకాల పటనం చేశారు. ఆలయంలో ఆంజనేయస్వామి, శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కందరెల్లి గ్రామానికి చెందిన హనుమాన్ భజన భక్తబృందం, భవాని మాత భక్తుల బృందం , యువకులు గ్రామ పెద్దలు, చిన్నారులు పారాయణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భగవద్గీత పారాయణం చేయడం వల్ల యువకులు, చిన్నారుల్లో భక్తి భావం పెరుగుతుందని అన్నారు. భక్తి భావం పెరిగితే సన్మార్గంలో ఉంటారని, మానసిక ప్రశాంతత లభిస్తుందని సత్సంగ్ సమితి అధ్యక్షులు నారాయణ సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అదరగొట్టిన నేతాజీ స్కూల్ విద్యార్థులు