కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే ఖబడ్దార్..!
– జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు తగదు
– అధికారం పోయిందని పిచ్చి కూతలా..?
– జీఓలు తెచ్చినా జీరో డెవలప్ మెంట్
– మాజీ ఎమ్మెల్యే పైలెట్ సింగపూర్‌కే పరిమితం
– నాలుగేళ్లుగా నడిచిన గుట్కా, డ్రగ్స్ పూర్తిగా బంద్
– మీడియా సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతల్లారా ఖబడ్దార్ అంటూ తాండూరు మున్సిపల్ అధికార పార్టీ కౌన్సిలర్లు ద్వజమెత్తారు. మున్సిపల్ పాలకవర్గ పదవి కాలం పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్, ఎమ్మెల్యేపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సల్మా ఫాతిమా, బోంబీనా, బోయరవి తదితరులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అధికార పార్టీ పై విమర్శలు చేయడాన్ని ఘాటుగా ఖండించారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లకు మాట్లాడే అవకాశం ఇచ్చినా ఘనత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిది అన్నారు. కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగితే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అదేవిధంగా అధికారం పోతుందని మతి భ్రమించి మీడియా ముందు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాలుగు సంవత్సరాలలో కనీసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంను సమన్వయం చేయలేకపోయారని విమర్శించారు. నాలుగు ఏండ్లలో చేసిన అభివృద్ధి ఏమి చేయలేదన్నారు. గతంలో ఆయన తీసుకవచ్చిన జీఓలతో జీరో డెవలప్ మెంట్ జరిగిందని అన్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న మాజీ రోహిత్ రెడ్డి అక్కడికే పరిమితమయ్యారని అన్నారు.
రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే విమర్శించడం విడ్డూరమన్నారు. మహిళ కౌన్సిలర్ల మనోభావాలు దెబ్బతినే విధంగా సభలో ప్రవర్తించడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే దొరల పాలన మాదిరిగా ఫాం హౌస్ నుంచి కాదు ప్రజాక్షేత్రంలో గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. తాండూరులో గత యేడాది క్రితం జోరుగా కొనసాగిన అవినీతి అక్రమాలు, గుట్కా, గంజాయి, డ్రగ్స్ కార్యకలాపాలు(ఆరోపణలు) జీరోకి చేరి.. పూర్తిగా బంద్ అయ్యాయని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

