‘వినాయక సూపర్’ సేవలు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

‘వినాయక సూపర్’ సేవలు..!
– ఫ్రీ క్యాంపులో పేదలకు ఉచిత వైద్యం
– గాంధీనగర్ లో వైద్య శిబిరానికి స్పందన
– అభినందించిన మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నూతనంగా ప్రారంభమైన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలతో సూపర్ అనిపించుకుంది. మంగళవారం తాండూరు పట్టణం గాంధీనగర్ లో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. హస్పిటల్ కు చెందిన డా. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డులోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు.

బీపీ, షుగర్, దగ్గు, జ్వరం వంటి తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందించిన ఉచిత వైద్య సేవలు అభినందనీయమన్నారు. అదేవిధంగా డా. విజయ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు.

హస్పిటల్ లో జనరల్ ఫిజీషియన్, కార్డియాలజీ, ఈఎన్టీ, ఆర్థోఫిడిక్, పల్మనాలజీ, గైనకాలజి స్ట్ డెర్మాటాలజిస్ట్, నెఫ్రాలజీ, యూరాజలిస్ట్, కాథలాబ్ తదితర కార్పోరేట్ వైద్య సేవలను అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ముక్తార్ నాజ్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ మహిళ అభ్యున్నతికి కృషి చేయాలి