బీసీ మహిళ అభ్యున్నతికి కృషి చేయాలి
– బీసీ సంఘం తాండూరు డివిజన్ అధ్యక్షురాలుగా అనిత
– నియామకపత్రం అందించిన జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ మహిళల అభ్యన్నతికి కృషి చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం బీసీ సంఘం తాండూరు డివిజన్ మహిళ అధ్యక్షురాలుగా రాజీవ్ కాలనీకి చెందిన అనితను నియమించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ తో పాటు జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారీలు అనితకు నియామకపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగాను అనితను డివిజన్ అధ్యక్షురాలుగా నియమించినట్లు తెలిపారు. తాండూరు డివిజన్ లో బీసీ మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామాల్లో కమిటీలను నియమించాలన్నారు. అదేవిధంగా డివిజన్ అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ తనపై నమ్మకంతో డివిజన్ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం పట్ల జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, రాజ్ కుమార్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, లక్ష్మీ, నర్సమ్మ, మంజుల, విజయలక్ష్మీ, బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమణి, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, టైలర్ రమేష్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

