హ్యాకింగ్‌కు డేంజర్ బెల్.. గ్రీన్ సిగ్నల్..!
– ఈ లైట్ మోబైల్‌లో కనిపిస్తే జాగ్రత్త
– లేదంటే సైబర్ నేరగాల్లో ఉచ్చులో పడ్డట్టే
– దీనితో ఎలాంటి నేరాలకు పాల్పడుతారంటే..?
దర్శిని డెస్క్ : సాకేంతిక పరిజ్ఞానంతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చూస్తూ ఆన్‌లైన్ మోసాలకు తెగబడుతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఈ సైబర్ నేరాల గురించి వింటూనే ఉన్నాం. రేపు మీరే ఆ బాధితులు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా సైబర్ అటాకర్లు పంజా విసురుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడేవారే వీరి మెయిన్ టార్గెట్. రోజంతా ఫోన్ వాడే వారిని టార్గెట్ చేసి మొత్తానికి బురిడీ కొట్టించేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. వీరి మోసాలను ఓ ట్రిక్ ద్వారా కనిపెట్టేయొచ్చు.
హ్యాకింగ్ అయిందో లేదో తెలుసుకోండి… ఇలా
మీ ఫోన్ హ్యాకింగ్ కి గురైతే వెంటనే స్పందించడం ద్వారా నష్టపోకుండా ఉండొచ్చు. అందుకోసం మీ ఫోన్ లో మీరు చేయాల్సిన పని ఎప్పటికప్పుడు దానిపై ఓ కన్నేసి ఉంచడం. యాప్స్ ను వినియోగించే సమయంలో వాటికి పర్మిషన్స్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫోన్ స్క్రీన్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీకు సంబంధం లేని ఏదైనా సిగ్నల్ తెరపై కనిపిస్తే చూసీచూడనట్టు వదిలేయకండి. స్మార్ట్ ఫోన్ యూజర్లకు దడపుట్టిస్తున్న గ్రీన్ లైట్.. మీ స్క్రీన్‌పై చెక్ చేసుకోండి
చెక్ పెట్టండి ఇలా
మీ వ్యక్తిగత డేటాను దొంగలించి మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడమో లేక పాస్ వర్డ్ చోరీ చేసి అకౌంట్ ఖాళీ చేయడమో చేస్తుంటారు. మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైతే మీ ఫోన్ స్క్రీన్ పై గ్రీన్ కలర్ లో ఒక చుక్క కనపడుతుంది. ఇది మైక్ లేదా కెమెరా ఆన్ చేసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మీ ఫోన్ రికార్డు అవుతుందని తెలిపే సంకేతం. మీరు ఇలా కనిపించినప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే స్పందించి అలెర్టవ్వండి. మీ సెక్యూరిటీ సెట్టింగ్స్ ను సెట్ చేసి యాక్సెస్ ను పరిమితం చేయండి. కెమెరాకు, మైక్ కు ఏదైనా కొత్త యాప్ లు యాక్సెస్ ఇచ్చి ఉన్నాయా అనే విషయం చెక్ చేసుకోండి. చాలా మంది మీ డబ్బులు కాజేయడానికి ముఖ్యంగా చేసే పని మీ సీక్రెట్ పాస్ వర్డ్స్ ను, డేటాను దొంగిలించడమే. ఇందుకు వీరి దగ్గరున్న ఆయుధం మీ స్క్రీన్ ను మీకు తెలియకుండా రికార్డ్ చేయడమే.
ఇదికూడా చదవండి…

