సేవామూర్తి ఉప్పల శ్రీనివాస్ గుప్త

తాండూరు వికారాబాద్ హైదరాబాద్

సేవామూర్తి ఉప్పల శ్రీనివాస్ గుప్త
– వైద్య సేవలకు అంబులెన్స్ బహుకరణ అభినందనీయం
-కేటీఆర్ సమక్షంలో కృతజ్ఞతలు తెలిపిన రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పేదలకు తనవంతు సహాయం చేస్తూ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త సేవామూర్తిగా నిలుస్తున్నారని వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రటకరి రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మెల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం హైదరాబాద్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త పేదల వైద్య సేవల కోసం రూ. 25లక్షల సొంత నిధులు కేటాయించి అత్యాధునిక వసతులతో అంబులెన తను విరాళంగా అందజేశారు. ఈ అంబులెన్సున్న మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా రొంపల్లి సంతోష్ కుమార్ కూడ పాల్గొని ఉప్పల శ్రీనివాస్ గుప్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మెల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ను అందించి గొ ప్ప మనసును చాటుకున్నారని అన్నారు. నిరంతరం పేదల సేవల్లో సేవామూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాసుప్త స్పూర్తితో తాండూరులో కూడ సేవా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. మరోవైపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి కేటీఆర్ను రొంపల్లి సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.