బీసీ కులాలకు అండగా బీసీ సేన..!
– 100 మందితో కొత్త కార్యవర్గం ఏర్పాటు చేస్తాం
– తాండూరు డివిజన్ హడాక్ కమిటి కోఆర్డినేటర్ ఆనంద్ బగాడే
– మార్చిలో రాష్ట్ర అధ్యక్షులు బర్క కృష్ణ నేతృత్వంలో బీసీ సేన సభ
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ఫ్రతినిధి : బీసీ కులాలను బలో పేతం చేసి… అండగా నిలబడేలా బీసీ సేన కార్యవర్గాన్ని సిద్దం చేసుకోవాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం హిమాలయ హోటల్లో సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘంకు అనుబంధంగా బీసీ సేన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం, పట్టణం నుంచి యువతను చేర్చుకోవడం జరుగుతుందన్నారు.
త్వరలోనే 100 మందితో బీసీసేన కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీసీ సేన హడాక్ కమిటికి తాండూరు పట్టణంకు చెందిన ఆనంద్ బగాడే అనే యువకున్ని కోఆర్డినేటర్ గా నియమించారు. వచ్చే మార్చిలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బర్క కృష్ణ ఆధ్వర్యంలో తాండూరులో బీసీ సేన సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, పెద్దేముల్ మండల యువజన సంఘం అధ్యక్షులు నవీన్, నియోజకవర్గ యువనాయకులు రాంరెడ్డి, పరమేష్, వెంకట్, మొగులప్ప, కాంతు, జగ్గు, రఘు, నరేష్, మధు, సురేష్, నాని, శేఖర్, వీరేష్, వర్దన్, శ్రీశైలం, వివేక్, సయ్యద్ లాల్, బాబా గౌడ్, రాజు, రఘు గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

