బాలాజీ ఎలక్ట్రానిక్స్ లక్కా డ్రా.. సూపర్ హిట్..!
– హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్, మార్కెట్ కమిటి చైర్మన్
– విజేతలకు యాక్టీవా, డబుల్ డోర్ ఫ్రిజ్, గ్రాము గోల్డ్ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా సమీపంలో ఉన్న బాలాజీ ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంపర్ లక్కీ డ్రా ప్రోగ్రాం సూపర్ హిట్ అయ్యింది. నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ఫెస్టివల్ బోనాంజా బంపర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డిలు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ విద్యావేత్త మైపాల్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బంపర్ డ్రా లో లాటరీ పద్ధతి ద్వారా విజేతలను ఎంపిక చేశారు.
ఇందులో మొదటి బహుమతి యాక్టివా(కూపెన్ నెం. 988)ను వికారాబాద్‌కు చెందిన వైద్యనాథ్ గెలుచుకోగా, రెండవ బహుమతి డబల్ డోర్ ఫ్రిడ్జ్(కూపన్ నెం. 173)ను కోకట్‌కు చెందిన రమేష్, మూడవ బహుమతి ఒక గ్రామ్ బంగారం(కూపన్ నెం. 970)ను ప్రశాంత్ జీవన్ అనే వ్యక్తులు దక్కించుకున్నారు. విజేతలకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డిల చేతుల మీదుల అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వస్తువులను కొనుగోలు చేసిన కస్టమర్లకు మేలు చేకూర్చాలని నిర్వహకులు చేపట్టిన లక్కీ డ్రా కార్యక్రమం అభినందనీయమన్నారు.
అదేవిధంగా బాలాజీ ఎలక్ట్రానిక్స్ నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు పండుగ వేళలో గృహ ఉపయోగకరాలు కొనుగోలు చేసేవారిని ప్రోత్సహించేందుకు ఫెస్టివల్ బొనాంజా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మూడు బహుమతులతో పాటు క్యాష్ బ్యాక్ ప్రైజ్, లగేజ్ బ్యాగులు, ఐరన్ బాక్స్ లు, వెడ్డింగ్ నాణేలను కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన కస్టమర్లకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదికూడా చదవండి…
అధ్యాపకుల సంఘం వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా శ్రీనివాస్ గౌడ్

