ఫ్యాన్సీ నెంబర్‌కు అదిరే డిమాండ్..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

ఫ్యాన్సీ నెంబర్‌కు అదిరే డిమాండ్..!
– 9999కు రూ. 4.55లక్షల వేలం
– పరిగి యూనిట్‌కు లక్షల ఆధాయం
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు..సెంటిమెంట్‌ అయితేనేమి, ఇష్టమైన నంబ‌ర్‌ అయితేనేమి, జాతక బలం ప్రకారం అయితేనేమి.. అనుకున్న నంబర్‌ను ద‌క్కించుకునేందుకు వాహ‌నాల య‌జ‌మానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. వికారాబాద్ జిల్లాలోని పరిగి యూనిట్ కార్యాలయంలో 9999 ఫ్యాన్సీ నెంబర్‌కు అధిరే డిమాండ్ వచ్చింది.

ఆన్ లైన్ లో నిర్వహించిన వేలం పాటలో ‘9999’ నంబర్ కి గిరిజపురం మాధవ రెడ్డి 4,55,450 (నాలుగు లక్షల యాబై ఐదు వేల నాలుగు వందల యాబై) రూపాయల కి వేలం పాట ద్వారా నంబర్ ను దక్కించుకున్నట్లు జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. కొత్త సిరీస్ ప్రారంభం కావడంతో ఈ సారి పరిగి యూనిట్ కార్యాలయంకు 7,17,149 రూపాయల భారి ఆదాయం లభించినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

ఇదికూడా చదవండి…

మిస్టరీగా తల్లీ, కొడుకుల ఆత్మహత్యలు..!