చల్లారని శిలాఫలకం సెగ..!
– వ్యక్తులను అరెస్టు చెయాలంటూ నాయకుల ఆందోళన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ మండలంలో రెండు రోజుల క్రితం శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటన చల్లారిపోవడంలేదు. శిలాఫలకంను ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదివారం నాయకులు ఆందోళణకు దిగారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని పోలీస్టేషన్ ముందు నాయకులు ఈ ఆందోళన చేపట్టారు. మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్దేముల్ సోసైటి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ వైఎస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఇందుర్ ప్రకాష్, మాజీ సర్పంచ్ కిషన్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు డివై నర్సింలు తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో దర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతరెండు రోజులక్రితం సునీతమ్మ పర్యటనలో కొందరు వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం శిలాఫలకం ధ్వంసం చేశారని అన్నారు. కావాలనే రాజకీయ కక్ష్యతో శిలా ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులు శిలాఫలకం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల యువత అధ్యక్షుడు రాఘవేంద్రర్ రెడ్డి, మహేందర్ అన్న యువసేన అధ్యక్షులు అన్వర్, మాణిక్యం, మాజీ వార్డు మెంబర్లు నర్సముల్, బందెప్ప, అజిమ్ తదితరులు పాల్గొన్నారు.
