ఎండ స్ట్రోక్‌కు ఉల్లి చెక్..!
– వేసవిలో ఉల్లితో అద్బుత లాభాలు
– పచ్చి ఉల్లితో ప్రయోజనాలు
దర్శిని డెస్క్ : ఉల్లి ఎంత ప్రధానమైనదో అందరికి తెలిసిందే. మన వంటింట్లో ఇవి లేనిదే ఏ వంట చేయలేరు. ఉల్లి వంటలకే కాదు ఒంటికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వేసవిలో ఉల్లిపాయ పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో యాంటీ-అలెర్జీ, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్ వంటి లక్షణాలు ఉంటాయి. ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు మినరల్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల వడదెబ్బ నుండి కాపాడుకోవచ్చు.

అందుకే వేసవిలో కొంతమంది వీటిని పచ్చిగా కూడా తింటారు. పచ్చి ఉల్లిపాయ ప్రభావంలో చల్లగా ఉంటుంది. ఇది మీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అధిక వేడి నుంచి రక్షిస్తుంది. ఉల్లిపాయ నుంచి పొందే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మరిన్ని ప్రయోజనాలు
ఉల్లిపాయలో ఉండే విటమిన్ ఏ,సీ,కేల నుంచి చర్మం తేమగా మారుతుంది. దీంతో చర్మం కాంతివంతగా, తేమగా ఉంటుంది. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయను తింటే అది దంతాల బ్యాక్టీరియాని, చిగుళ్ళ సమస్యను తొలగిస్తుంది. ఉల్లిపాయ నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. మహిళలు పీరియడ్స్ సమస్యల నుంచి బయటపడేందుకు ఉల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సమయంలో ఉల్లిపాయ తింటే మంచిది. శీరరంలో ఇది చక్కెరను నియంత్రించడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగ్గా చేస్తుంది. ఉల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలను తినాలి. ఉల్లిపాయలో ఎముకలు బలహీనపడకుండా నిరోధించే గుణాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధిని నియంత్రించవచ్చు.

గమనిక: మాకు లభించిన అధ్యాయాల ద్వారా సమాచారాన్ని అందించడం జరగుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచింది.
ఇదికూడా చదవండి…

