ఆ శాఖ‌ల అధికారులు విధుల్లో ఉండాలి

ఆరోగ్యం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఆ శాఖ‌ల అధికారులు విధుల్లో ఉండాలి
– ఆస్తిన‌ష్టం, ప్రాణ న‌ష్టాలు జ‌ర‌గ‌కుండా చూడాలి
– ఢిల్లీ నుంచి స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్
ద‌ర్శిని ప్ర‌తినిధి: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ప్రకటించింది. భారీ వ‌ర్షాల‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి సీఎస్ సోమేష్ కుమార్‌తో స‌మీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వాల‌ని ఆదేశించారు. కాని అత్యవసర శాఖలపై రెవెన్యూ, పోలీస్‌, ఫైర్‌, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాల శాఖల అధికారులు విధుల్లో ఉండాలని స్ప‌ష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్‌కు సూచించారు. ఇదిలా ఉండగా.. గులాబ్‌ తుఫాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలు రెడ్‌ అలెర్ట్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.