మూడు బస్సులకు ఒకే నెంబ‌ర్

తెలంగాణ హైదరాబాద్

మూడు బస్సులకు ఒకే నెంబ‌ర్
– ఆర్టీసీలో బ‌య‌ట‌ప‌డిన బండారం
– ట్రాఫిక్ చలాన్లతో బండారం బట్టబయలు!
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ఆర్టీసీలో కొన‌సాగుతున్న ఓ బండారం బ‌ట‌య‌ప‌డింది. మూడు బ‌స్సుల‌కు
ఒకే నెంబర్ ఉంచి ర‌వాణా సేవ‌ల‌ను అందిస్తోంది. అదికూడ గరుడ ప్లస్, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బ‌స్సుల‌కు కేటాయించ‌డం గ‌మ‌నార్హం. గతంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఒకే నెంబర్‌ మీద రెండు అంతకంటే ఎక్కువ బస్సులను నడిపిన సందర్భాలున్నాయి. అయితే టిఎస్‌ ఆర్టీసీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 z 0208 నంబర్‌తో ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌గా నడుస్తోంది. హైదరాబాద్ 3 డిపోలోని గరుడ ప్లస్ సర్వీస్‌ కూడా అదే నంబర్‌పై తిరుగుతుండడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మూడు బస్సులను గుర్తించిన ఆర్టీవో అధికారులు వాటిపై చలాన్లు విధించారు. దీంతో ఆస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

అయితే ఈ మూడు బస్సులకు హైదరాబాద్ పరిధిలో రెండు, సైబరాబాద్ పరిధిలో రెండు చలాన్లు ఉండ‌గా రాచకొండ, ఆదిలాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ పరిధిలోనూ ఒక్కో చలాన్‌ల‌తో మొత్తం 8 చ‌లాన్లు న‌మోదై ఉన్నాయి. ఒకే నెంబర్ మీద మూడు బస్సులు ఎలా తిరుగుతున్నాయి?. ఆ బస్సులకు ఒకే నెంబర్ ఎందుకు కేటాయించారనేది అర్ధం కావడం లేదు. అనుమానం వచ్చిన అర్టీవో అధికారులు అసలు వ్యవహారాన్ని గుర్తించి లోతుగా ఆరా తీస్తున్నారు.