పేషెంట్‌కు, వైద్యుడికి గుండెపోటు
– ఇద్దరూ ఒకేసారి కన్నుమూత
– కామారెడ్డి జిల్లాలో విషాధం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన రోగికి వైద్యం చేస్తుండగా వైద్యుడు కూడ గుండెపోటుకు గురయ్యాడు. కొద్ది సేపటి తరువాత ఇద్దరు కన్నుమూశారు. ఈ హృదయ విధాకర సంఘటన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ రావడంతో.. స్థానికంగా ఉన్న నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అయితే అతనికి ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలోనే ఆసుపత్రి డాక్టర్ లక్ష్మణ్‌కు కూడా హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో స్పాట్లోనే డాక్టర్ లక్ష్మణ్ మృతి చెందారు. మరోవైపు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్‌ను కుటుంభీకులు వెంటనే పేషెంట్‌ను కామారెడ్డి ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ ఈలోపే మార్గమధ్యలోనే ఆ పేషెంట్ కూడా మృతి చెందాడు. అటు పేషెంట్‌కు ప్రాణం పోసేందుకు ప్రయత్నించిన డాక్టర్.. ఇటు పేషెంట్ ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వారు పరిశీలించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇద్దరు గుండెపోటుతో కన్నుమూయడంపై ఆవేధన వ్యక్తం చేశారు.

