చిన్నారి వశిష్ఠకు మరో రూ. 1లక్ష సాయం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

చిన్నారి వశిష్ఠకు మరో రూ. 1లక్ష సాయం
– బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపుతో డబ్బుల జమ
– కుటుంబానికి అందజేసిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపుతో ఓ చిన్నారి ప్రాణం నిలువబోతోంది. లివర్ సమస్యతో బాధపడుతున్న 9నెలల బాలుడు వశిష్ట చికిత్స కోసం మరో రూ. 1 లక్ష సాయం అందింది. తాండూరు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి పిలుపు మేరకు వచ్చిన నగదును జమచేసి కుటుంబానికి అందజేశారు.

యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల కుమారుడు వశిష్ఠ(9నెలలు), అరుదైన కాలేయా వ్యాధి(బైలేరియా అట్రేసై) కోసం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా నేతలు శాలువాలు, బొకేలు తీసుకరాకుండా ఆ డబ్బులను చిన్నారి వశిష్ట చికిత్స కోసం అందచేలా చెల్లించాలని కోరారు. శ్రీనివాస్ రెడ్డి పిలుపు మేరకు పలువురు నగదు రూపంలో రూ.35వేలు, మిగతా 67 వేల రూపాయిలు ఫోన్ పే, గూగూల్ పే, ఆన్ లైన్ ద్వారా చెల్లించారు.

మొత్తం నగదును శనివారం తాండూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు జోషి వికాస్, బాతుల నాగులు చిన్నారి మేనమామ చందుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారి వశిష్ఠకు త్వరగా చికిత్స అందాలని, క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

పాలిటిక్స్ అండర్ ప్రెషర్…!