సూపర్‌ తమ్ముడూ..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సూపర్‌ తమ్ముడూ..!
– పరిచయం లేని వ్యక్తికి రక్తదానం
– యువకుడి స్పూర్తికి అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అడిగితే గాని పరులకు సాయం అందించని రోజులు ఇవి. అలాంటి ఆపదలో ఉన్న వృద్ధుడికి పరిచయం లేకున్నా మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ఓ యువకుడు అందరి చేత సూపర్ తమ్ముడు అనిపించుకున్నాడు.

తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికీ చెందిన అబ్దుల్ సత్తార్ మియ 66 సంవత్సరాలు గల పెద్దాయనకు ఎమర్జెన్సీ గా A+Positive బ్లడ్ అవసరం పడింది. ఈ విషయం తెలుసుకున్న పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన చిన్న సంగమేశ్వర్ తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రక్తనిధి కేంద్రంలో వృద్ధుడు కోసం రక్తదానం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు సంగమేశ్వర్‌ను అభినందించారు. ఆయన స్పూర్తితో యవత ఆపదలో ఉన్న వారకి కోసం రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రక్తదానం చేసిన యువకుడు సంగమేశ్వర్ రాజకీయాల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ఇదికూడా చదవండి…

కీవీ.. ఆరోగ్య గని..!