క‌రెంట్ షాక్‌తో కాడెద్దు మృతి

క్రైం తాండూరు వికారాబాద్

క‌రెంట్ షాక్‌తో కాడెద్దు మృతి
– రైతుకు తీర‌ని న‌ష్టం
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రెంట్ షాక్‌తో ఓ కాడెద్దు మృతి చెందింది. వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డిన రైతుకు న‌ష్టం వాటిళ్లింది. ఈ సంఘ‌ట‌న శుక్ర‌వారం యాలాల మండ‌లం నాగస‌ముంద‌ర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిచ్చ‌కుంట్ల ఈర‌ప్ప త‌న ఎద్దుల‌ను పొలం వ‌ద్ద ప‌నులు చేసేందుకు తీసుకెళ్లారు. పొలం వ‌ద్ద విద్యుత్ స్థంబం స‌మీపంలోని వైర్లు త‌గ‌ల‌డంతో ఓ ఎద్దు అక్క‌డిక‌క్క‌డే షాక్ గురై క‌న్నుమూసింది. గ‌మ‌నించిన స్థానికులు కాపాడే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితంల లేకుండా పోయింది. ఎద్దు మ‌ర‌ణించ‌డంతో రైతుకు భారీ న‌ష్టం వాటిళ్లింది. ఎద్దు మృతి చెంద‌డంతో కుటుంబ స‌భ్యులు బోరున విల‌పించారు.