హ్యాపీ.. బర్త్ డే రోహితన్నా..!
– ఘనంగా పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినం
– రోహిత్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
– నివాసంలో కేక్ కటింగ్, ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
– బీఆర్ఎస్వీ, రోహితన్న యువసేన ఆధ్వర్యంలో రక్తదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని ఆయన నివాసంలో అట్టహాసంగా కేక్ కటింగ్ చేశారు. అంతకుముందు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్ల పంపిణీ చేశారు.

అదేవిధంగా బీఆర్ఎస్వీ, రోహితన్న యువసేన ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌరస్తాలో నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. రోహిత్ రెడ్డి జన్మదినం సందర్బంగా తాండూరు పట్టణంలోని ఆయన నివాసం సందడిగా మారింది. పార్టీ నేతలు, అభిమానులు నివాసానికి పోటెత్తారు. రోహిత్ రెడ్డి చేత భారీ కేక్ లు కట్ చేయించారు. నేతలు అభిమానులు గజమాల, పూలదండ, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రోహిత్ రెడ్డి, ఆయన తండ్రి విఠల్ రెడ్డి చేతుల మీదుగా శాంతి కపోతాలను ఎగురవేయించారు. ఉదయం నుంచి రోహిత్ రెడ్డి నివాసంలో పండగ వాతావరణం నెలకొంది.
శుభాకాంక్షలు తెలిపిన నేతలు
రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, విజయ్ కుమార్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి. కోహీర్ శ్రీనివాస్, దేవాలయాల మాజీ చైర్మన్లు కుంచెం మురళీధర్, తర్లపల్లి భాను, యువ నాయకులు ఈర్షాద్, కోట్రిక శ్రీకాంత్, జావిద్, సందీప్ రెడ్డి, ఎర్రం శ్రీధర్, చంటి యాదవ్, తాండూరు మండలం నుంచి శకుంతల, గౌతాపూర్ మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, రాంలింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తుప్పుడు శేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, తాండూరు మాజీ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, ఆసిఫ్, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాలకు చెందిన నాయకులు. కార్యకర్తలు భారీగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

