పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్ వర్దన్..!
– పోలీస్టేషన్‌లో బాధ్యతల స్వీకరణ
– తాండూరుతో ఆయనకు బంధుత్వం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండల ఎస్ఐగా ప్రశాంత్ వర్దన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన శ్రీధర్ రెడ్డిని సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రశాంత్ వర్దన్‌ను పెద్దేముల్ మండల ఎస్ఐగా నియమించారు. ఈ మేరకు శనివారం పెద్దేముల్ మండల పోలీస్టేషన్‌లో ప్రశాంత్ వర్దన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు కూడా శాంతియువత వాతావరణంకు సహకరించాలన్నారు. అసాంఘీక కార్యక్రమాలు, అక్రమ రవాణా, అవాంచనీయ సంఘటనలు జరిగినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మరోవైపు పెద్దేముల్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ప్రశాంత్ వర్దన్‌కు తాండూరుతో బంధుత్వం ఉంది. ఇటీవలే తాండూరు సబ్ డివిజన్‌లో పనిచేస్తున్న పోలీసు అధికారి కూతురుతో ఆయన వివాహాము జరిగింది. దీంతో ఆయన తాండూరు అల్లుడుగా మారారు.
ఇదికూడా చదవండి…