ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే..!
– కొంత మంది పోయిన పార్టీకి నష్టం లేదు
– సంక్షేమ పథకాలు సర్కారును మళ్లీ గెలిపిస్తాయి
– మంత్రి ఆదేశాలతో పైలెట్ గెలుపుకు కృషి
– డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉందని, సర్కారు సంక్షేమ పథకాలతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్, ఎల్మకన్నె పీఏసీఎస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కడుపులో ఉన్న బిడ్డతో, పాటు మనిషి చనిపోయిన తరువాత కూడా లబ్దిపొందే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, అసరా, ఆరోగ్య బీమా, రైతు బంధు, రైతు బీమా, దళిత బందు, బీసీ బందు, మైనార్టీ సాయం, గృహలక్ష్మీ వంటి అద్భుతమైన పథకాలను అందిస్తున్నారని అన్నారు. ఈ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయన్నారు. తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపుకోసం కృసి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతూ ఆయనకు మద్దతు ఇచ్చేలా ప్రచారం చేస్తున్నామన్నారు. అయితే కొంత మంది బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
కొంత మంది పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినంత మాత్రానా పార్టీకి వచ్చే నష్టమేమి లేదన్నారు. ఇందులో కొందరు స్వార్థం కోసం వెళితే.. మరికొందరు పాత కాంగ్రెస్ నాయకులే పార్టీ విడిస్తున్నారని అన్నారు. ఆ పార్టీలో అభ్యర్థి ఎవరనేది స్పష్టం కాలేదని, దిక్కు దివానా లేకుండా పోయిందని విమర్శించారు. ఏదేమైనా ప్రజల మద్దతుతో పైలెట్ గెలుపు, రాష్ట్రంలో హ్యాట్రిక్ సర్కారు ఖాయమన్నారు.
ఇది కూడా చదవండి…

