ఆర్టీసీలో చార్జీల మోత..!
– బస్ పాస్ ధరల పెంపు
– పెంచిన ధరలు వెంటనే అమల్లోకి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో చార్జీల మోత మోగింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. పెరిగిన పాస్ చార్జీలు ప్రకారం.. గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది. రూ.1,300గా ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్, ప్రస్తుతం రూ.1,600కి పెరిగింది. అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్, ఇప్పుడు రూ.1,800గా అమలులోకి వచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్టు అధికారిక సమాచారం. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో సామాన్య ప్రజానీకానికి రవాణా ఖర్చులు అధికమవుతాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ బస్సుల్లో ప్రయాణించే వారు ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. మరింతగా ప్రభుత్వ వివరణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఇదికూడా చదవండి…

