అప్రమత్తతతో విపత్తుల నుంచి రక్షణ

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అప్రమత్తతతో విపత్తుల నుంచి రక్షణ
– ఆకట్టుకున్న ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్
– ప్రదర్శనల ద్వారా నియంత్రణపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : విపత్తులు సంభవించినప్పుడు అప్రమత్తతతోనే వ్యవహిస్తే రక్షణ పొందవచ్చని నేషనల్ డిజార్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) అధికారులు, తాండూరు రెవెన్యూ అధికారులు అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్డీఎఫ్ ఆధ్వర్యంలో విపత్తుల నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. ఎన్టీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ దామోదర్ సింగ్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రకృతి పరంగా లేదా మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంబవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కల్లకు కట్టినట్లు మాక్ డ్రిల్ చేసి ఆకట్టుకున్నారు.

వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా కాపాడుతారో.. స్వయంగా ఎలా కాపాడుకోవచ్చో ప్రయోగాత్మంగా చేసిన ప్రదర్శనలు ఆసక్తిని పంచాయి. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ దామోదర్ సింగ్ మాట్లాడుతూ ఆపదలు, విపత్తులు సంభవించినప్పుడు అందరు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నియంత్రణ చర్యలతో రక్షణ పొందవచ్చాన్నారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన తాండూరు తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ విపత్తుల సమయాల్లో ఎన్టీఆర్ఎఫ్ చేసే రక్షణ చర్యలు కీలకంగా ఉంటాయన్నారు. ప్రమాదాలు, విపత్కరణ పరిస్థితుల నుంచి కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఎన్టీఆర్ఎఫ్ ఐఎన్ఎస్పీ ప్రదీప్, కానిస్టేబుల్ రవీందర్, ఎస్ఐ సుదీర్, నవీన్, బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం