దళిత నాయకుల అరెస్టులు దుర్మార్గం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దళిత నాయకుల అరెస్టులు దుర్మార్గం
– తాండూరు డీఎస్పీపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు
– పెళ్లి వేడుకల్లో దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
– దళిత, ప్రజా సంఘాల నేతల డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దళిత యువకుడి పెళ్లి వేడుకల్లో దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ డీఎస్పీ కార్యాలయ ముట్టడికి యత్నించిన నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని దళిత, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ముందస్తు అరెస్టులకు ఆదేశించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు.

గత నెల 18న తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడు వినయ్ కుమార్ భారత్ పెళ్లి ఊరేగింపు నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన మద్దూరు ప్రవీణ్, మద్దూరు అశోక్, ఈడిగి శివకుమార్, కోడంగల్ చరణ్ లు ఊరేగింపును అడ్డుకుని, దళితులపై దౌర్జన్యానికి దిగుతూ దాడికి పాల్పడ్డారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండు చేస్తూ ఆదివారం తాండూరు డీఎస్పీ కార్యాలయ ముట్టడి నేపథ్యంలో తాండూరు డీఎస్పీ దళిత, ప్రజా సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేయించారని ఆరోపించారు. కావున తాండూరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అదేవిధంగా దళిత యువకుడి పెళ్లిలో దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్. మహిపాల్, ఉపాధ్యక్షులు బూస చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పోరాట హక్కుల సమితి జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రత్నం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, నాయకులు రఘుపతి, రాజు, గోపాల్, వీరేశం, వెంకటేష్, బెల్కటూర్ గ్రామ ప్రజలు మాల అంజిలప్ప, శ్రీనివసా, మొగులయ్య, ప్రవీణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వికాసం వస్తుందో.. రాదో..!