స్వయం ఉపాధికి తోడ్పాటు సేవ భేష్..!
– ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ కృషి అభినందనీయం
– రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత, మహిళల స్వయం ఉపాధికి తోడ్పాటు అందించే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం భేష్ అని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ అన్నారు.

తాండూరు పట్టణం ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్ కోచింగ్ సెంటర్ ను ఆయన సందర్శించారు. ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం నిర్వహిస్తున్న టైలరింగ్ శిక్షణను పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ కోత్వాల్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత చదువులకు, యువత, మహిళల స్వయం ఉపాధితో పొందేందుకు ముస్లిం వెల్ఫేర్ స్కిల్డ్ డెవలప్ మెంట్ సోసైటీ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. సోసైటీ అందిస్తున్న సేవలకు తమవంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. సోసైటీ ద్వారా శిక్షణ పొందిన మహిళలు నైపుణ్యాలను మెరుగు పరుచుకుని స్వయం ఆర్ధికాభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షులు కమల్ అతహర్, ఉపాధ్యక్షులు బాసిత్ అలీ. కార్యదర్శి మహమ్మద్ యూనుస్, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, ఖయ్యూం అతహర్, కోశాధికారి సిరాజ్, ఖలీలుల్లా షరీఫ్, అబ్దుల్ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడ చదవండి…

