ఇదేం వ‌క్ర‌బుద్ది..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇదేం వ‌క్ర‌బుద్ది..!
– ఆనలుగురినే విమ‌ర్శించా
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: న‌లుగురు ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్ల‌పై చేసిన విమ‌ర్శ‌ల‌ను కొంద‌రు వ్య‌క్తులు వ‌క్రీక‌రించి అంద‌రి కౌన్సిల‌ర్ల‌కు ఆపాదించార‌ని మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. శుక్ర‌వారం మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ మాట్లాడుతూ మున్సిప‌ల్లో గ‌త రెండేళ్ల నుంచి ప్ర‌తిప‌క్ష న‌లుగురు కౌన్సిల‌ర్లు మాన‌సిక క్షోభ‌కు గురిచేస్తున్నార‌ని అన్నారు. త‌న ఇంటిపేరును జోడించి లేనిపోని విమ‌ర్శ‌లు చేశార‌ని అన్నారు. వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేయ‌డంతో దీనిని భ‌రించ‌లేక గురువారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో న‌లుగురు కౌన్సిల‌ర్ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను మాత్ర‌మే వ‌క్రీక‌రించి అంద‌రి కౌన్సిల‌ర్ల‌కు ఆపాదిస్తూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నార‌ని అన్నారు. ఈ విష‌యాన్ని అంద‌రు కౌన్సిల‌ర్లు గ‌మ‌నించాల‌ని, న‌లుగురిని త‌ప్పా అంద‌రిని గౌర‌వించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. కొంద‌రి మాట‌ల‌ను న‌మ్మ‌రాద‌ని సూచించారు. నా మాట‌ల‌ను వ‌క్రీక‌రించడం ఇదేం వ‌క్ర‌బుద్ది అని విమ‌ర్శించారు.