హత్య కేసు నిందితులకు షాక్…!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
హత్య కేసు నిందితులకు షాక్…!

– నలుగురుపై రౌడీషీట్ నమోదు

– వెల్లడించిన బషీరాబాద్‌ ఎస్ఐ శంకర్
– ఏ కేసులో నమోదు చేశారంటే..?
బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఓ హత్య కేసులోని నిందితులకు బషీరాబాధ్‌ పోలీసులు షాక్ ఇచ్చారు. ఒకేసారి నలుగురు నిందితులపై రౌడీషీట్ నమోదు చేశారు. మంగళవారం బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు. బషీరాబాద్‌ మండలం నవల్గా గ్రామంలో ఈ యేడాది ఫిబ్రవరి 4వ తేదిన గ్రామానికి చెందిన మాల నర్సప్ప అనే వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఈ కేసులో గ్రామానికి చెందిన మాల సుగుణమ్మ, మాల శివకుమార్, కొత్త విజయ్ కుమార్, గొట్టుగ విశ్వనాథ్‌లు నిందితులు.

ఈ నిందితులప్ప అప్పట్లో 24 గంటల్లోనే కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. తాజాగా వ్యక్తి హత్య కేసులోలో నిందితులుగా ఉన్న మాల సుగుణమ్మ, మాల శివకుమార్, కొత్త విజయ్ కుమార్, గొట్టుగ విశ్వనాథ్‌లపై రౌడీషీట్ నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్ వెల్లడించారు. నిందితుల నేర ప్రవృత్తిని దృష్టిలో ఉంఉకుని వారిపై రౌడీషీట్ నమోదు చేయడం జరిగిందని వివరించారు.

అసలు కేసులో ఎం జరిగిందంటే…?
నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సిములు, శ్యామప్ప (38), శ్యామమ్మ సంతానం. శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉండేవాడు. అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నర్సిములు, వదిన సుగుణ నివసిస్తున్నారు. మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని సుగుణమ్మ భావించింది.

ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, మాల శివకుమార్‌లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే రూ.50 వేలకు డీల్ చేసుకుంది. ఈ క్రమంలో సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్‌ వేశారు. ఫిబ్రవరి 3వతేదిన శ్యామప్పను తీసుకుని గ్రామ శివారు తాతగుడి సమీపంలోని రాథోడ్‌ మోహన్ అనే వ్యక్తికి చెందిన పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్పపై దాడి చేసి.. గొంతు పిసికారు. తరువాత తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న బషీరాబాద్‌– తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పడేశారు. మృతుని వదిన సుగుణమ్మపై అనుమానంతో పాటు ముగ్గురు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదికూడా చదవండి…

అంబులెన్స్‌లో గర్భిణికి పురుడు..!