అంబులెన్స్‌లో గర్భిణికి పురుడు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
అంబులెన్స్‌లో గర్భిణికి పురుడు..!

– తల్లడిల్లిన తల్లికి సిబ్బంది సపర్యలు
– ప్రసవం తరువాత తల్లీ బిడ్డా క్షేమం
– బషీరాబాద్‌ మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పురిటి నొప్పులతో బాధపడుతున్న తల్లికి అంబులెన్స్‌ సిబ్బంది పురుడు పోశారు. అంబులెన్స్‌లో మహిళ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మంగళవారం బషీరాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం దామర్‌చేడ్ గ్రామానికి చెందిన నరేష్ భార్య అంబిక (22) రెండో సారి గర్భం దాల్చింది.

ప్రస్తుతం నెలలు నిండడంతో మంగళవారం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంభీకులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ సిబ్బంది గ్రామానికి వచ్చారు. ఆమెను తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కాసింపూర్ గ్రామం సమీపంలో అంబికకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

గర్భిణికి అంబులెన్స్ సిబ్బంది జి. ప్రకాశ్, ఎం.డి. నసిరుద్దీన్ సపర్యలు అందించారు. కాన్పులో అంబిక పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. వారిని తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, ప్రజలు అంబులెన్స్ సిబ్బందిని అభినందించారు.

ఇదికూడా చదవండి…

వేధిక్ విశిష్ఠలో ఎలక్షన్స్..!