బీసీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు
– అన్నివిధాలుగా సహాకారం
– మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో శనివారం తాండూరులో చేపట్టే బంద్‌కు సహాకారం అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చేపట్టిన ఉద్యమంతో బాగస్వాములం అవుతామని అన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి బీసీ బంద్‌లో స్వచ్ఛంగా పాల్గొని జయప్రదం చేస్తామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

