తాండూరు నియోజకవర్గంలో 79.57శాతం పోలింగ్

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు నియోజకవర్గంలో 79.57శాతం పోలింగ్
– అత్యధికంగా పెద్దేముల్, అత్యల్పంగా బషీరాబాద్
– ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ భాష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం తరువాత నుంచి కౌంటింగ్ జరిగింది. నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ భాష పరిశీలించారు. తాండూరు మండలంలోని ఖాంజాపూర్, గౌతాపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందరి ్శంచారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యలు పర్యవేక్షించారు.

అన్ని గ్రామపంచాయతీలలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాతంగా ముగిశాయి. పోలింగ్ శాతం వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం 77.70శాతం, బషీరాబాద్ మండలంలో 77.45శాతం, యాలాల మండలంలో 80.49శాతం, పెద్దేముల్ మండలంలో 82.64శాతం నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధిక ఓటింగ్ శాతం పెద్దేముల్ మండలంలో నమోదు కాగా అత్యల్పంగా బషీరాబాద్ మండలంలో నమోదయ్యింది.

ఇదికూడా చదవండి…

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు