తాండూరులో సినిమా షూటింగ్..!
– సాయిపూర్ వాసికి యాక్టింగ్ చాన్స్
– నటనతో ఆకట్టుకుంటున్న స్థానికుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్కు చెందిన చిత్ర బృందం పలు సన్నివేశాలతో చిత్రీకరణ చేస్తోంది.

ఈ సినిమా షూటింగ్ తాండూరు పట్టణంలోని సాయిపూర్లో కొనసాగుతోంది. ఈ సినిమాలో సాయిపూర్కు చెందిన కృష్ణారెడ్డి వ్యక్తి యాక్టింగ్ చేస్తున్నారు. మంగళవారం సాయిపూర్ ప్రాంతంలో చిత్రీకరణ జరిగింది. తీసుకున్న అప్పును వసూలు చేసే అనే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సీన్లో కృష్ణారెడ్డి తన అప్పును వసూలు చేసుకునే సన్నివేశాలలో నటించారు.

తమ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి.. స్థానికులు షూటింగ్ చూసేందుకు ఎగబడ్డారు. అయితే సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదని తెలిసింది. ఇంకా మూడు నాలుగు రోజులు షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి వాక్సిన్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి…

