శాంతి భద్రతలో పోలీసులే కీలకం

తాండూరు రాజకీయం వికారాబాద్

శాంతి భద్రతలో పోలీసులే కీలకం
– సామాజిక సృహ అభినందనీయం
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి
– పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందించే సేవలు ఎంతో కీలకమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు.

పోలీసుల అమర వీరుల దినోత్సవంను పురస్కరించుకుని పోలీసు శాఖ తాండూరు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు పలు సంఘాల ప్రతినిధులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
kvcs
జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది శిబిరంలో సేవలను అందించారు. రక్తదానం చేసిన వారిని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అభినందించి.. ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ముందు ఉండేది పోలీసులే అని అన్నారు. సమాజానికి సేవలు అందింస్తున్న పోలీసుల పట్ల గౌరవం ప్రదర్శించాలని అన్నారు. అదేవిధంగా రక్తదాన శిబిరాలతో పోలీసులే కాకుండా సామాన్యులు కూడా సామాజిక సృహను చాటుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు