పల్లె ‘చుక్క’ కుడి, ఎడమలపై..!
– అందరికి ఎడమ చేతి చూపుడు వేలుపైనే సిరా
– వారికి మాత్రం కుడి చేతిపై గుర్తు
– ఎందుకు ఇలా చేస్తారో తెలుసా..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లకు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేయడం చూస్తుంటాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో అందరికి ఎడమ చేతి వేలుపై సిరా గుర్తు వేస్తే కొందరికి మాత్రం కుడి చేతిపై ఎన్నికల సిరా గుర్తు వేయనున్నారు.

ఇలా ఎందుకు చేస్తారో ఇప్పటికే మీకు అనుమానం రావచ్చు. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అంధులు, ఆశక్తులైన(మా నసిక సమస్య) వారికి సాయపడేందుకు నిబంధన ఉంది. సదరు అంధుడు లేదా ఆశక్తుడు తమకు సాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన వ్యక్తిని ఎంచుకోవచ్చు. ఇదే విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలియజేస్తే ఓటు హక్కు వినియోగంకు అనుమతి లభిస్తుంది.

సహచరుడితో లోపలికి వెళ్లిన ప్రత్యేక ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకుంటాడు. ఎవరికి ఓటేశారనే విషయాన్ని వెంట వచ్చిన సహచరుడు గోప్యంగా ఉంచాలి. అదేవిధంగా మరోమారు ఇతరులకు సహాయకుడి గా రానంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. ఓటేసే ఓటరు ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తుంటారు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి కుడి చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు పెడతారు. ఇప్పుడు అర్థమైంది కదా.. కుడి చేతికి సిరా గుర్తు ఎందుకు వేస్తారో.

ఓటు హక్కు వినియోగం ఇలా…
ఓటరు తన గుర్తింపు కార్డు చూపించిన తర్వాత ఓటరు జాబితాలో ఉన్న పేరు, ఒకే రకంగా ఉండటం తోపాటు, పోలింగ్ ఏజెంట్ కూడా ఓటరును గుర్తిం చిన అనంతరం ఎడమచేతి చూపుడు వేలుపై సిరాగుర్తు పెట్టిన తర్వాత ఓటరు తన బ్యాలెట్ పేపరు తీసుకుని ఓటు హక్కును వినియోగించు కోవాల్సి ఉంటుంది.

ఇదికూడా చదవండి…

