మనోహరన్న ఇలాఖాలో హస్తం హవా..!
– తాండూరు చరిత్రలో 25 పంచాయతీల ఏకగ్రీవం
– ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల గెలుపు ఖాయం
– ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత అనురాగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న తాండూరు నియోజకవర్గంలో హస్తం హవా కొనసాగుతోందని, గతంలో కనివిని ఎరుగని రీతిలో పంచాయతీలు ఏకగ్రీవం కావడం చారిత్రాత్మకం అని ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత అనురాగ్ అన్నారు.

ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 25 గ్రామపంచాయతీల పైన ఏకగ్రీవం అవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్ల మనోహర్ రెడ్డి పాలనలో ఏ గ్రామంలో కూడా వర్గ విభేదాలు పక్కన పెట్టి ఎలాంటి అక్రమ కేసులు లేకుండా పాలన అందిస్తున్నారని, కాబట్టే జిల్లాలోనే అత్యధిక స్థానాలు ఏకగ్రీవం తాండూర్ లో అవ్వడం జరిగిందని అన్నారు. దీనికి తోడు కరణ్ కోట్ లాంటి మేజర్ గ్రామపంచాయతీ ఏకగ్రీవం అవ్వడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టుదలకు నిదర్శనమని అన్నారు.

అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా గతంలో ఎన్నడు లేని విధంగా పార్టీలకతీతంగా కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండేళ్ల పాలనలో మనోహర్ రెడ్డి గారు అందించడం జరిగిందని చెప్పుకొచ్చారు.

అదేవిధంగా తాండూరు – హైదరాబాద్ రోడ్డు గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది, మనో రెడ్డి గారు గెలిచిన వెంబడి పనులు ప్రారంభించడంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు సాగునీటి ప్రాజెక్టులు, విద్య వైద్యంపై, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలపై పూర్తి చిత్తశుద్ధితో మనోహర్ రెడ్డి పనిచేయడంతో నియోజకవర్గ ప్రజలందరూ ఈనెల 11న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమని అన్నారు.

ఇదికూడా చదవండి…

