పైలెటా.. మజాకా..!
– కాంగ్రెస్ జోరుకు కారుతో కళ్లెం
– అన్ని మండలాల్లో కారు దూకుడు
– పంచాయతీ పోరులో కలిసోచ్చిన ప్రచారం
తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటించి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైలెట్ అయ్యారు. అధికార పార్టీ కాంగ్రెస్ జోరుకు కళ్లెం వేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ హవా చాటుకోవడంతో కాంగ్రెస్ ఖంగుతినాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గురువారం జరిగిన పంచాయతీ పోలింగ్, ఓటింగ్ ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ అభ్యర్థుల గెలుపుకోసం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విశేషంగా కృషి చేశారు. నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు మండలాల్లోని గ్రామాల్లో నిర్వహించిన ప్రచారం ఫలితాలను తీసుకవచ్చింది. సొంత గ్రామం ఇందర్ చేడ్ నుంచి మిగతా మండలాల్లోని గ్రామాల్లో గులాబీ వీరుల గెలుపుకు ప్రభావం చూపించారు.

పెద్దేముల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మద్దతు, డీసీసీ ధారాసింగ్ నేత ఉన్నా కూడా బీఆర్ఎస్ మద్దతుదారుని గెలుపు జిల్లాలోనే చర్చనీయాశంగా మారింది. పంచాయతీ పోరులో గులాబీని గుభాళించేలా చేసి పైలెటా.. మజాకా అని నిరూపించుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు
బషీరాబాద్ మండలంలో ఇందర్ చేడ్, గంగ్వార్, క్యాద్గిరా, అల్లాపూర్, దామర్ చేడ్, కంసాన్పల్లి-ఎం, కంసాన్ పల్లి-బీ, నవల్గా, గొట్టిగకలాన్, మంతటి, కొత్లాపూర్, బాద్లాపూర్ తాండా, కొర్విచేడ్, కొర్విచేడ్ గని, కుప్పన్ కోట్, మల్కాన్ గిరి, నీళ్లపల్లి, పర్వత్ పల్లి, హంక్యానాయక్ తాండా(ఏకగ్రీవం), నంద్యానాయక్ తాండా(ఏకగ్రీవం).
తాండూరు మండలంలో బెల్కటూర్, మిట్టబాస్పల్లి, చింతామణిపట్నం, జినుగుర్తి, గుండ్లమడుగుతాండ, గుంతబాస్పల్లి, కోటబాస్పల్లి, కొత్లాపూర్, పర్వతాపూర్, సంగెంకలాన్, సరిగిరిపేట్.
యాలాల మండలంలో అక్కంపల్లి, అన్నసాగర్, బషీర్మీయా తాండా, దేవనూర్, దౌలాపూర్, గోరేపల్లి,ముకుందాపూర్, నాగసముందర్, పేర్కంపల్లి, రాఘవపూర్, రాస్నం, ఎన్కెపల్లి, కోకట్, పేర్కంపల్లి తాండా(ఏకగ్రీవం).
పెద్దేముల్ మండలంలో బాయిమీది తాండా, బండమీదిపల్లి, బుద్దారం, ఎర్రగడ్డ తాండా, జయరాంతాండా, మదనంతాపూర్, ఊరేంటి తాండా, పాషాపూర్, రుక్మాపూర్, పెద్దేముల్.

ఇదికూడా చదవండి…

