చట్టబద్ధతతోనే ఎన్నికలకు వెళ్లాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

చట్టబద్ధతతోనే ఎన్నికలకు వెళ్లాలి
– పార్టీ రిజర్వేషన్లతో అన్యాయం
– జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– సబ్-కలెక్టర్ కార్యాలయం ముట్టడి, ప్లకార్డులతో నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీలకు 42% చట్టబద్ధత కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

శుక్రవారం తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో సబ్-కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం అన్యాయం అని అన్నారు. 17వ తేదీ క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం, అలాగే కేంద్రం నుండి నిధులు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడం బీసీలను మభ్యపెట్టే రాజకీయ మాటలు తప్ప మరేమీ కావని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య పిలుపుమేరకు తాండూర్ సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టినట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోమని అన్నారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత, శ్రీనివాస్ చారి, తాండూరు మహిళా అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షు కార్యదర్శులు మంజుల, నరసమ్మ, జగదీశ్వరి, నాయి బ్రాహ్మణ సమాజ అధ్యక్షులు పరమేష్, రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రమేష్, రవికుమార్, కురువ సంఘం సభ్యులు బసప్ప, గౌడ సంఘం నాయకులు పండు గౌడ్, హరి ప్రసాద్ గౌడ్, రవి గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు రాము ముదిరాజ్, దుబాయ్ వెంకట్, హరి ప్రసాద్, శ్రీనివాస్, బహుజన నాయకులు అరుణ్ రాజ్, జోసఫ్, అంతారం ప్రవీణ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ సంఘం మండల అధ్యక్షులు నరేందర్, బసంత్ కుమార్, బీసీ సంఘం యువ నాయకులు యాసర్, పరమేష్, అశోక్, శ్రీనివాస్, పకీరప్ప, అంబాదాస్, రాజు, జగదీష్, కందినేని జగన్, కందనెల్లీ జగన్, జగదీశ్వరయ్య, శ్రీనివాస్, చిన్న కిరణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

కేసులు పెట్టడం హేయం..!