వికారాబాద్ జిల్లా రద్దుకు కుట్ర
– జిల్లా రద్దుతో ప్రాంతానికి నష్టం ఖాయం
– నాడు ఎమ్మెల్సీ, నేడు సీఎంల పాత్ర
– కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని భగ్నం చేద్దాం
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో జిల్లాల రద్దుకు కాంగ్రెస్ రద్దుకు కుట్ర చేస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత వికారాబాద్ ప్రత్యేక జిల్లా కోసం ఎంతోమందితో పాటు తానుకూడా పోరాటం చేయడం జరిగిందన్నారు. వికారాబాద్ జిల్లాతో పాటు జిల్లాను చార్మినార్ జోన్‌లో విలీనం చేసేందుకు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం హాయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
వికారాబాద్ జిల్లా ఏర్పాటులో అప్పటి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఆస్తుల కోసం చేవేళ్ల, శంకర్ పల్లి ప్రాంతాలను విలీనం కాకుండా చేశారని అన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ ను మహబూబ్ నగర్ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాను కూడా రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అదే జరిగితే జిల్లా మరో 20 ఏండ్లు వెనక్కు వేళ్లే ప్రమాదం. ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత పార్లమెంట్ నియోజకవర్గం చేవేళ్ల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తరుపున ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను భగ్రం చేసేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న కొత్త జిల్లా రద్దు కోసం ప్రజలంతా మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. మరోవైపు పార్టీలోని నేతలు పార్టీ మారడంపై రోహిత్ రెడ్డి స్పందించారు. స్థానికంగా ఉన్న కొందరు నేతలు కక్ష్య పూరితంగా వారి పార్టీలోకి తీసుకుంటున్నారని, కొందరు స్వార్థం కోసం పార్టీ మారుతున్నారని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవని కొట్టి పారేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసమే పనిచేస్తున్నామని అన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ కు వస్తున్న మద్దతును ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే అత్యధికంగా ఓట్లు వస్తాయని. కాంగ్రెస్, బీజేపీ ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకే మల్లుతాయని ధీమా వ్యక్తం చేశారు.
రేపు బహిరంగ సభ
మరోవైపు పార్లమెంట్ ప్రచారంలో భాగంగా రేపు తాండూరు పట్టణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభకు మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి సబితారెడ్డి, చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, జిల్లా అధ్యక్షులు డా.మెతుకు ఆనంద్. మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు.
ఈ సభకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, విజయ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ ఆశన్న తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

