తెలుసుకోండి.. నిధులు రాబట్టండి..!

జాతీయం తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలుసుకోండి.. నిధులు రాబట్టండి..!
– కొత్త సర్పంచులకు కలిసోచ్చే పద్దులు
– ఈ విషయాలు తెలిస్తే అభివృద్ధి ఈజీ
దర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో తొలివిడత పంచాయతీలు ఎన్నికలు హోరా హోరీగా ముగిశాయి. కొత్త సర్పంచులు పదవులు చేపట్టి పాలన అందించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో పంచాయతీలను అభివృద్ధి బాట పట్టించాలంటే కత్తిమీద సాములాగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

గ్రామాల అభివధ్ధికి అవసరమయ్యే నిధులను సాధించుకునే విషయాలను తెలుసుకుంటే పాలన సవ్యంగా సాగుతోందని అంటున్నారు. అసలు పచాయతీలకు నిధులు ఎలా వస్తాయి.. ఎక్కడి నుంచి వస్తాయి.. ఎలా వినియోగించాలనే అంశాలను కొత్త సర్పంచులు తెలుసుకోండి.

జనాభా ఆధారంగా
పల్లెల్లో ఉన్న జనాభా ఆధారంగా నిధలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తోంది. దీనికి నెలకు ఒక్కో వ్యక్తికి రూ.80 నుంచి రూ.90 చొప్పున కేటాయిస్తోంది. ఇవి ప్రతి 3 నెలలకు ఒక్కసారి, ఇలా సంవత్సరానికి నాలుగు విడతలుగా అందిస్తోంది.

మరోవైపు ఇక రాష్ట్రంలో అయితే ఆర్థిక సంఘం నిధులు సైతం క్రమం తప్పకుండా మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇవి గ్రామపంచాయతీ జనాభా ప్రాతిపదికన ఇస్తారు. కొన్నాళ్లుగా ఇవి విడుదల కావడం లేదు. దీనికి బదులుగా సర్కార్​ మల్టీపర్పస్​ వర్కర్లకు వేతనాలు, విద్యుత్తు బిల్లులు చెల్లిస్తోంది. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.

ఉపాధి హామీ నిధులు
గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. కూలీలుగా చేసే పనులకు 60 శాతం, మరో 40 శాతం నిధులు మెటీరియల్​ కాంపోనెంట్​ కింద మంజూరు చేస్తారు. అలాగే వీటితోనే గ్రామంలో మురుగు కాలువలు, సీసీ రహదారులు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తారు.

పన్నులు, సాధారణ నిధులు
గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పన్నులు వసూలు చేస్తారు. ఇంటి, గృహ నిర్మాణ అనుమతుల కోసం చెల్లించే పన్నులు, నల్ల బిల్లులు, ఆస్తి మార్పిడి, దాతల నుంచి అందే దీని పరిధిలోకే వస్తాయి. పంచాయతీలు సొంతంగా సమాకూర్చుకునే వాటిని సాధారణ నిధుల కింద గుర్తిస్తారు. ఈ నిధులు పెంచుకోవడానికి పంచాయతీలు ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాల్సి ఉంటుంది.

ఇదికూడా చదవండి…

 

గులాబీ.. గుభాళింపు..!