మజ్జిగతో వేసవి తాపం దూరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మజ్జిగతో వేసవి తాపం దూరం
– ప్రతిరోజూ ఉచితంగా పంపిణీ చేస్తాం
– తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వేసవిలో మజ్జిగతోనే వేసవి తాపం తీరుతుందని, ఈ వేసవిలో బాటసారులకు ఉచితంగా అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు మార్వాడి యువ మంచ్ సభ్యులు అన్నారు. సోమవారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని రాజస్థాని మహిళ మండల అధ్యక్షురాలు సంతోష్‌ సంపత్ కుమార్ రాఠి, కార్యదర్శి కిషోరీ భగవాన్‌దాస్ బూబ్ గగ్రానిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా మాట్లాడుతూ గత 6 ఏండ్లుగా వేసవిలో బాటాసారులకు ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం ద్వారా సేవలందించడం జరుగుతుందన్నారు. ఈ సారి కూడ వేసవిలో 100 రోజులు ప్రతి రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉచిత మజ్జిగ కేంద్రం ద్వారా ఉచితంగా మజ్జిగను వితరణ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజూ 3 వేల మందికి పంపిణీ చేసి వేసవి తాపాన్ని తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ మాజీ అధ్యక్షులు రమేష్‌ చంద్ర బూబ్, ఓం ప్రకాష్‌ సోమాని, రామానుజ్‌దాస్ సోని, సంపత్ కుమార్ సార్డా, భగ్‌వాన్‌దాస్ బూబ్, మంచ్ కార్యదర్శి అరుణ్‌ సార్డా, కోశాధికారి కిషన్ రాఠి, సభ్యులు మన్మోహన్ బూబ్, కరణ్‌ జైన్, అనిల్ సార్డా, అశిష్‌ సార్డా, కృష్ణ బూబ్, శ్రీగోపాల్ రాఠి, సునిల్ సార్డా తదితరులు పాల్గొన్నారు.