ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేత
– ఉమ్మడి రంగారెడ్డిలో అమల్లోకి
ఉమ్మడి రంగారెడ్డి, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం లో స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ శశాంఘ్ గోయయల్ ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నామినేషన్ ధాఖలు, ఉపసంహరణ, ఏకగ్రీవ ఎన్నికలు ముగియడంతో ఈ నిర్ణణం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజులు అధికార పార్టీ నుంచి నామినేషన్ వేసిన తెలిసిందే. బరిలో వాళ్లిద్దరే ఉండడంతో ఎన్నికల సంఘం వారిని ఏకగ్రీంగా ఎన్నిక చేసింది. నిన్నటితో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజులు ఏకగ్రీవంగా ఎన్నిక పత్రాలను కూడ అందుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఉమ్మడి జిల్లాలో ఈనెల 9 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ను నిన్నటితో ఎత్తివేసినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.


