తాండూరు సబ్‌ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు సబ్‌ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు..!
– అడిషనల్‌ కలెక్టర్‌గా నారాయణపేటకు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారుల బదీలీల ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా తాండూరు సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఉమా శంకర్ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇక్కడి నుంచి నారాయణపేట్‌ జిల్లాకు అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు)గా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

వృద్ధుల సేవలో సంతృప్తి..!