వృద్ధుల సేవలో సంతృప్తి..!
– కందనెల్లిలో దుప్పట్ల పంపిణీ
– మార్వాడి యువమంచ్ సేవా కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతృప్తిని కలిగిస్తోందని తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు అన్నారు.

మంగళవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రెండో విడత దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. మార్వాడి యువమంచ్ సభ్యులు గ్రామంలోని వృద్ధులకు చలికాలంను దృష్టిలో ఉంచుకుని దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు సభ్యులు మాట్లాడుతూ గత 40 ఏండ్లుగా మార్వాడి యువమంచ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

మారుమూల పల్లెల్లు, తాండాలలో విద్యా, వైద్యం, వృద్ధులు, చిన్నారులకు మంచ్ ద్వారా తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం సంతృప్తిని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, సర్పంచు యాదమ్మ, ఉపసర్పంచ్ వాజిద్, న్యాయవాది కిరణ్, మార్వాడి యువమంచ్ అధ్యక్షులు అనిల్ సార్డా, కోశాధికారి అరుణ సార్డా, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ రాఠి, పవన్ సోనీ, రమాకాంత్ పండిట్, నితిన్ సార్డా, సోషల్ వర్కర్ వెంకట్, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

