చిలుక వాగుపై ఫోకస్..!
– సందర్శించిన చైర్ పర్సన్, అధికారులు
– వాగు అభివృద్ధితో వరధ కష్టాలు దూరం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చిలుక వాగును అభివృద్ధి చేసి ప్రజలకు వరధ, డ్రైనేజీ కష్టాలు రాకుండా చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి తాండూరు పట్టణం ఆదర్శనగర్ సమీపంలోని చిలుకవాగును సందర్శించారు. చిలుక వాగు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని అని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు చిలుక వాగు అభివృద్ధిపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఇప్పటికే రూ. 16 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో చిలుక నాగును అభివృద్ధి చేసి పట్టణంలో డ్రైనేజీ, వరధ ముంపులు రాకుండా చూస్తామన్నారు.
చిలుక వాగు కబ్జాలను తొలగించడంలో ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయాదేవి, డీఈ ఖాజా హుస్సేన్, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు వేణుగోపాల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి….

