శభాష్.. శ్రీలక్ష్మీ..!

కెరీర్ క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

శభాష్.. శ్రీలక్ష్మీ..!
– అక్షర విద్యార్థినికి డా. సంపత్ కుమార్ ప్రశంసలు
– జాతీయ స్థాయి ఖోఖో పోటీలో సత్తాకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్.. శ్రీలక్ష్మీ అంటూ తాండూరు సీనీయర్ నాయకులు డా. సంపత్ కుమార్ అక్షర స్కూల్ వి ద్యార్థినిని అభినందించారు. అక్షర స్కూల్లో 9వ తరగతి చదవుతున్న శ్రీలక్ష్మీ రాష్ట్ర స్థాయి పోటీలో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.

రాజస్థాన్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న శ్రీలక్ష్మీ తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొంది. ఖోఖో పోటీలో అద్భుత మైన ప్రదర్శన కనబరిచి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. తిరిగి తాండూరుకు చేరుకున్న శ్రీలక్ష్మీ అక్షర స్కూల్ వ్యవస్థాపకులు, సీనీయర్ నాయకులు డా. సంపత్ కుమార్ ను కలిసింది. దీంతో డా. సంపత్ కుమార్ శ్రీలక్ష్మీని శభాష్ అంటూ అభినందించారు. రానున్న రోజుల్లో కూడా క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థినితో పాటు పీటీని కూడా అభినందించారు. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్, డైరెక్టర్లు, టీచర్లు శ్రీలక్ష్మీ జాతీయ స్థాయి పోటీలో ప్రాతినిధ్యం వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

సీఎంఆర్ఎఫ్‌ పేదలకు వరం..!