సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం..!
– పార్టీలకతీతంగా సహాయ నిధి మంజూరు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోట్ పల్లి మండలాలతో పాటు తాండూరు పట్టణానికి చెందిన సుమారు 200 మందికి రూ.75లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహరరెడ్డి తన చేతుల మీదుగా లబ్దిదారులకు ఎల్బీసీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్యఖర్చులు భరించలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని అన్నారు. పార్టీలకతంగా పేదలందరికి ఈ పథకం ద్వారా వైద్య ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని అన్నారు. అనారోగ్యానికి గురైన పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, అప్పూ(నయూం), కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, సురేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, హబీబ్ లాల, శోభారాణి, గాజుల మాధవి, వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

