జయహో సుభాష్ చంద్రబోస్
– తాండూరులో నేతాజీకి ఘన నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను తాండూరు నాయకులు జహహో అంటూ కీర్తించారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి వేడుకలను తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తా సమీపంలో ఉన్న నేతాజీక్లబ్, జనచైతన్య యువజన సంఘంల ఆధ్వర్యంలో పలువురు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశస్వాతంత్రం కోసం పోరాడిన మహాయోదుడని కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించారని గుర్తుచేశారు.
“మీరక్తాన్ని ధారపోయండీ. మీకు స్వాతంత్రాన్ని ఇప్పిస్తాను” అంటూ ఆయన నినాదాలు యువకులను ఉత్తేజ పరిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా శాంత్ మహాల్ చౌరస్తా రోడ్డు విస్తరణలో భాగంగా సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని రోడ్డు మద్యలో ఏర్పాటు చేసేందుకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యూత్ క్లబ్ అధ్యక్షులు సాంబూరు సోమశేఖర్, కోటం శంకర్, దాదపురం రవీందర్, బీదర్ రాజశేఖర్, ఘనాపూర్ శంకర్, కోటం సిద్దలింగం, బంటారం భద్రేశ్వర్, కుంచెం అజయ్ కుమార్, జన చైతన్య యువజన సంఘం సభ్యులు జుంటుపల్లి వెంకట్, యువకులు తదితరులు పాల్గొన్నారు.


